Monday, February 8, 2016

అంబటి భానుప్రకాశ్.
పాఠశాల సహాయకులు.( S.A.) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బుర్దపేట. గద్వాల. 
పాలమూరు జిల్లా.
మొబైల్ నం. 9948948787.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

తేది: 10-01-2016.
🙏🙏🙏🙏🙏🙏🙏

కం**
భారతి కంఠము జేరెను
సారము గలిగిన శతకపు సరసిజ మాలా
వారము విడువక రాసిన
సారము గల్గిన కవులకు సతతము జయమౌ.
🌷🌷🌷🙏🌷🌷🌷


గీ.మా**

అంశ మేదైన గానిమ్ము అలసి బోక
"ఏవి రావ"ను మాటను యెరుగ నీక
అన్ని గెలిచిన "వీరు"డ యనగ లేక
శతక మధురిమ శ్రీకాంత శర్మ గారు
కవిత జెప్పియు మెప్పును గొన్న వారు
 కవిత గూర్చిరి శతకము ఘనము గాను
అందు కొనుమిక మందార హార మాల


🌺🌺🌺🌺🌺🌺🌺

                 
నేడు సన్మానం పొందుతున్న కవులకు అభినందనలు.
కార్యయక్రమానికి హాజరు కాలేక పోవుచున్నాము ...మన్నించండి.

       మీ.....అంబటిభానుప్రకాశ్.
విజ్ఞాన నిలయాలు
ఒకప్పుడు, ,!
విష సంస్కృతి కి
బీజాలు,
ఇప్పుడు.!!

సుజ్ఞాన వంతులు,
విజ్ఞానాన్ని  పంచుతారని,
విశ్వవిద్యాలయం  చేరితే...!!

అజ్ఞానవంతులు ఒకచోట చేరి,
అవివేకానికి  ఆసరా అయితే...!!
యేమవుతారు
విద్యార్థులు ...!!!

"పాడి" చెప్పెడి పాలకులు ..!
"పాడు" చేస్తుంటే..!!
ఎక్కడ న్యాయం ..
అన్యాయం తప్ప. !! 

విద్య నేర్పడి గురువులు,
విధినిర్వహణ మరిస్తే
కుటిల నాయక
మోసాల చెరలో
అమాయకులు బలవుతుంటే...

ఎక్కడి కెళుతుందీ యవత...!
ఏమవుతుందీ దేశం! ! 

.................భానుప్రకాశ్.
🌷🌷🙏🌷🌷🙏🌷🌷

20.01.2016.

          శీర్షిక : హరిహరులు.

 సీసము**
మాధవు డగుపడె మరుగొల్పు నలుపున
        యుమపతి కనుగొన్న యుండె దెలుపు
పామునె పరుపుగ పవళించె శ్రీ హర   
           హరునిపై సర్పము  హార మమరె
కౌస్తుభము ధరించె గరివరదు యెదను
           రుద్రాక్ష. ధరియించె రుద్రు మెడను
గోవిందు వసియించె గోక్షీర సంద్రాన     
           మహదేవు వసియించె మంచు గిరిన. 
తే.గీ**

నటన సూత్రధ రుడిలను నడుపు చుండె

కలుపు చుండెను భవుడును కాల మందు

అరసి మొక్కెద హరిహరు యంద ముగను

దెలియ జెప్పెను భానుడు దెలివి గలిగి.

         *    శు భో ద య ం  *

                అంబటిభానుప్రకాశ్.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అయుత కవితా యజ్ఞం.
స.క.956.  
అంబటిభానుప్రకాశ్.
గద్వాల. 
21.01.2016.

          శీర్షిక : సర్పాలు మనవలె.

********&&******&&*******&&*****
తే**
పాము లన్నను చాలును భక్తి గలుగు
పాము లన్నను చాలానె భయము గలుగు
పాము చేయును హానని భయము వద్దు 
పాము మనిషికి యుపకార పడెటి జీవి.

ఆ**
చవితి నాడె పూజ చేతురు భక్తితో
సర్ప మనగ నీకు శతృవు గాదు
పాము యెడల నీవు పగను మాను
మరువ దగదు నాదు మంచి మాట.

ఆ**
శివుని మెడను చేరె సర్పము యొక్కటి
వాసు దేవు పడక వాసు కిపయి
దేవ దేవు లిట్లు  దీనిని గాచిరి
మరువ దగదు నాదు మంచి మాట 

ఆ**
పంట పొలము లోన పాములు జేరియు
ఎలుక లన్ని బట్టి యెట్లు జంపు
మనసు లేని మనిషి మృగమును దలపించి
మరచె చిన్న ప్రాణి మహిని యందు.

ఆ**
పంట పొలము జేరియు పాడు జేయు
ఎలుక లన్ని చంపు పాము లేర. 
పాము జేయు రక్ష పగలును రాత్రులు
రక్ష గోరు పాము  రైతు గొరకు.

ఆ**
కట్టె దెచ్చి చంపు కఠినుడై మనిషేను 
కరుణ లేని వాడు కనడు మేలు
చేరి నాయి భువిని జీవులు మనవలె
మనిషి వలెను బతుకు మనగ జేయి

               అంబటిభానుప్రకాశ్.

   🌷🙏🌷🙏🌷🙏🌷
🍀🌺🍀🌺🍀🌺🍀

🔹🔹🔹🔹🔹🔹🔹
అయుత కవితా యజ్ఞం.

సహస్ర కవి.956.
అంబటి భానుప్రకాశ్.
గద్వాల.  పాలమూరు జిల్లా. 
తేది:-   23-01-2016.
🔹🔹🔹🌸🌸🔹🔹🔹
      శీర్షిక : నదీ..తెలగాణ (నాడి.)
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
సీ****

 మముగన్న దల్లికి మల్లెల మాలను
       యర్పింతు మనసార యంద ముగను

గోదావరి నదియె గొంతును జేరియు
       పూబంతి మాలయ్యి పులక రించె

మంజీర మాదల్లి మందగమనముచే
       వడ్డాన మయ్యెను వరుస మీద

కృష్ణా నదియెనీకు కాలియందెగ మారె
       గలగల మనుకుంటు గదలి వచ్చె.
                                    
                                     (పద్యం...99)

తే.గీ**

ప్రాణ హితయును,పెన్ గంగ పరుగు లెత్తె
వైర మున్నేరు మానేరు వరద లెత్తె
దిండి కిన్నెర సానియు దిశల బారె
పరుగు పరుగున నదులన్ని పారు చుండె.

                                   (   పద్యం .. 100)

              అంబటి భానుప్రకాశ్.


       🙏🙏🙏🌺🙏🙏🙏🙏

󠀼󠀼󠀼󠀼󠀼󠀼󠀼?
వీరా గారికి ....
గణితమును తెలుగు ఛందో పద్య రూపమున
వెలయించ సంకల్పించారు.
వారికి శుభాభినందనలు.

కం**
చేసెడి పనినే దలచుచు
రాసెను కవితా గణితము రసికులు మెచ్చన్
వేసెను శతకపు పొత్తము
వాసిగ "వీరా" రచనకు, వందన మనరే !!

కం**
లెక్కలు జెప్పుట కష్టము
లెక్కలు జేయుట సులువని లీలన్ దెల్పెన్
లెక్కన పనులను జేయుచు
లెక్కగ బతుకును బతుకని లెక్కలొ జెప్పెన్.


                          అంబటి భానుప్రకాశ్.
                                        స.క.956.
               పాఠశాల సహాయకులు.( S.A.)
           ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బుర్దపేట.
                       గద్వాల. పాలమూరు జిల్లా.
                                   9948948787.

🌷🌷🌷🌷🌷🌷

 తేది:-౦1-02-2016.

శీర్షిక : భూషణాలు

భాషను కాపాడ నెంచిన పంతు లంత
ఆయు ధములైరి సాహితి యాత్మ యందు.
భూష.ణములైరి వాణికి భువన మందు
తెలుగు భాషయె  సాగును తెగువ గల్గి
మరువ వలదోయి భానుని మంచి మాట.

అంబటి భానుప్రకాశ్.


🌺     🌺    🌺    🌺
ఆ* ఆట వెలది తోడ యానందమిచ్చుచు
       కవుల పద్య చర్చ ఘనత గలుగ
        తెలుగుకవిత జోరు తెలుపగా,తరమౌన
        కవుల కవితనేడు కదలి వచ్చె.

           
శీర్షిక: యేకదంతుడు..
సకలములయిన పనులను చేయు వేళ
నిన్నుదలచిన జయమది నిక్కమేను
మూషికమునెక్కి జనులకుముదముగూర్చె
యేకదంతనిను దలతు హాయి నిమ్ము.

        అంశం: హద్దు.

తే* పరసతిని కోరి యింద్రుడె పాడి దప్పె
పరసతిని కోరి రావణు పతన మాయె
 పరసతిని కోరి సైంధవు పలుచనాయె
 " హద్దు" లేకయె చేసిన హాని సుమ్ము.!

తే*, హరిని గోపించి సుతునకు హాని జేసె
       చంప జూచెనుకొమరుని శత్రువనుచు
       హరియె గాపాడె బాలుని యయ్య నుండి,
       ' హద్దు' మీరగ వలదు హాని సుమ్ము.,!

తే,*
      తల్లిదండ్రులు మిగుల చేధనము నిచ్చి
      పంపుచుందురు వారినిభయము లేక
      హద్దు మీరెను చనువు యవని యందు
      హద్దు మరచిన వారికి హాని గలుగు!
తే,*
      నేటి కాలాన పిల్లలు నీతి మరచి
       హద్దు లన్నియు చెరిపియు యాడు చుంద్రు
       తల్లిదండ్రుల హద్దును దాట నపుడె
       నిండు సేమము వారికి నేటి యందు
అంబటి భాను ప్రకాశ్,
దుప్పల్లి. పాలమూరుజిల్లా.

* పద్య పూరణలు*

కం*, వరమునబుట్టిన బాలుని
          సరదాగాబారసాలసంబర వేళన్
          మురియుచు తాకిన ,యేడ్చెను
          విరితాకిడికోర్వలేని వీరుండితడే.


కం* ఒక్కడె యభిమన్యుడనియు
         తక్కినకౌరవులవంకతగిలిరి యనిలో
         గ్రక్కునజూచినవారలు 
         ఒక్కనితోనలువురాడ వోర్వంగలమా.
🌺🌺🌺🌺🌺

శీర్షిక : సురవళి.

ఎరవళి కాదు
సు ర వ ళి.....
అది
భూసురవళి...
వేదవ్యాసుడి
అయుతశిష్యులు
ఒకచో చేరగ..
సాగుచున్నది నేడొక
మహాయజ్ఞం.

లోక క్షేమము ధ్యేయంగా
నేటి క్షామము తొలగించా
అయుత చండీ యాగమే
సాగుచున్నది ...
ఎందరో రాజుల కాలంలో
సాగిన వెన్నోయాగాలు
కర్మను చేయి ఫలితంకోరకు 
గీతాసారము ఇదే కదా....
మనిషి కాదు నిత్యము
మంచే ఎపుడూ సత్యము.

..........అంబటిభానుప్రకాశ్.
                   అయుతచండీయాగం
                   !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  కం* దేవికి జరిగెడిపూజలొ
        సేవనుజేయగదలచిరిశిరసా జనముల్
       భావము దప్పక మనమున
      దేవత పదములు గొలచిరి దేశిక జనులు
         
🌺🌺🌺🌺🌺

 శీర్షిక:- ఆంగ్లాభిమానం

 తే,** మమ్మి డాడని పిలిచెడి మాట మాను
యమ్మ నాన్నని పిలువుము హాయి గుండు,
యాంగ్ల భాషల బిిలిచెడి యాస మాను,
మరువ వలదోయి భానుని మంచి మాట.


శీర్షిక: తెలుగు- తెలివి.

 దేశ దేశాల లోపల తెలుగు వారు
నెరపు చుండిరి పదవులు నేర్పు గలిగి
తెలివి గలిగిన వారలె దెలుగు వారు
మరువ వలదోయి భానుని మంచి మాట
   
        
[శీర్షిక :కులము

తే** 
కులము కులమంచు కుటిలపు కూత మాను,
కులము గాదుర ఘనమది గుణము గాని,
గుణము గలిగిన వాడిదె గొప్పతనము,
మరువవలదోయి భానుని మంచి మాట.


శీర్షిక : వందనము

తే**
 తల్లి గర్భము నందున తలువ లేదు,
యేల బెంచితివోగాని యెరుక లేదు,
తలతు నిత్యము నాకిక తలపు నుండు
తలువ మరువను యెప్పుడు తండ్రి నిన్ను.    (  ౮)
అంబటి భాను ప్రకాశ్
స.క.956.
గద్వాల.
    కవితాశీర్షిక: "ఆసరా""


      ఒకనాడు
      శరత్కాల వెన్నెల వేళ
      చల్లని ఇసుక తిన్నెల మీద
      సాగర, తీరాన
      సాయంత్రాలు సేద దీరే వారు
      " చెన్నయి" వాసులు
      
       నేడు
       వారినివాసమె
       సాగరమయింది.
       చుటూనీరే,
       తాగడానికీ నీరులేదు
       ఉండడానికీ చోటు లేదు
       ఇది యెవరో వేసిన శిక్షనా
       ఆదేవుని పరీక్షనా
      
      కన్నీటితో కలవర పడుతున్న
      పిల్లాపాపలతో, 
       ఆనీటిలో వణుకుతున్న
      ఆవేదనతో అలసిన వారికి,
      అండగా ఉందాము 

 " ఆ స రౌ దా ము "
🌺🌺🌺🌺🌺🌺

 శీర్షిక : జై జవాన్.
కవిత:
🌺🌺🌺
  సిపాయీ...
   ఓ సిపాయీ.....
    నీకు సలామోయీ...

     ఎండనక వాననక
     సరిహద్దులో....
     కరువనక వరదనక
     కష్టమొచ్చినపుడు
     కరుణ జూపి సాయపడే
     మంచి మనసు 
     నీదోయీ......
     యుద్దంలో శత్రువులను
     చండాడె వీరుడా..
      యుద్దమొక లెక్కా నీకు
       వరదలొచ్చి జగమంతా 
       జలమయమై పారితుంటె
       వరదలని నీకు అడ్దు....?
       
       చావంటే భయపడక
       భయపడిన,
        ప్రాణాలకు...
        ధైర్యమిచ్చి దరిజేర్చిన
        నీకు,నీవె సాటి కదా.....! 

        జై...జవాన్......
         జై...జవాన్........

                                  ..........అంబటి.భానుప్రకాశ్.
🌸🌸🌺🌸🌸🌼🌸🌸
     
🌺🌺🙏🌺🌺🙏🌺🌺

శీర్షిక ......
     " మేల్కొనండి"

   కవులారా....మేల్కొనండి
   మనుషుల్లో మానవత్వాన్ని
   నిద్రలేపండి! 
   మలినంతో కూడిన
   మనుషులను,మనస్సులను
   మీ.,,,మీ.,,,,,
   కవితాధారతో
   కడిగేయండి.
   
   సమస్యలంటూ...
   సతమతమౌతు...
   తమవారెవరికి చెప్పలేక,
  ' తప్పులేక'
   క్షణకాలపు
   ఆవేశంతో,
  అనాలోచనతో,
  జీవితాలనే బలిచేస్తుండే..
  ఆడ' పిల్లలను' కాపాడండి.
  
  కవితాఖడ్గం ఝళిపించి
  నూతనోత్తేజం నింపండి
   యువతలో.....
   వారికీ,..
   బ్రతికే హక్కుందని
   నినదించండి.

         ...........భాను ప్రకాశ్,అంబటి.
                             స.ళా.956.
🌼🌼🌼🌼🌼🌼🌼

శ్రీర్షిక:- ఏదేశం.

ఏదేశ సంస్కృతికి
ప్రపంచ దేశాలు గౌరవాన్నిస్తాయో
ఏదేశ ఆచారాలకు
ప్రపంచం అబ్బుర పడుతుందో
ఏదేశ ప్రజలకు
ప్రపంచం చేతులెత్తి నమస్కరిస్తారో
ఏదేశ ఐక్యతకు
ప్రపంచదేశాలు నీరాజనమిస్తాయో
ఏదేశ ఆప్యాయతలకు
ప్రపంచజనం ఆదమరుస్తుందో
ఏదేశ మేధస్సును
ప్రపంచ దేశాలు " మేటి" యనిపొగడుతాయో
అట్టి, ......
ఆదేశం....
నీ భా ర త దే శ ం.
భారతీయుడనని గర్వించు,
భరతమాతను సేవించు.
@@@@@@@ అంబటిభానుప్రకాశ్.

శీర్షిక, ,,, : ఇల్లరికపు ఘనులు

🌺🌺🌺🌺🌺

తే**, అత్త గారింట నుండగ యాశ వద్దు,
యిల్ల రికమైన వారికి యిడుము లుండు,
యెటుల నుంటిరొ మీరలు యిన్ని నాళ్ళు,
హరిహరులుఘనులైరయా హాయి గలిగి,

తే**, 
పాల సంద్రము నందున పద్మ నాభ
మంచు పర్వత మందున మౌని భవుడె,
యిన్ని దినములు మీకదియెట్లు గడిచె,
యత్త గారిలు యెటులుగ యచ్చి వచ్చె.

(..........ఇల్లరికమున్న ఇద్దరు ఘనులు.హరిహరులు.)

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌺🌺🙏🌼🌸🙏🌺🌺
మోసము జేయకు నరులను
గాసము గలిగిన సలుపుము ఘనమౌ నీకున్
కాసుల సంపా దించిన
వాసిగ గీర్తిని గడించ,వసుధే బొగడున్.

                  అంబటి  భానుప్రకాశ్.

🌼🌼🙏🌺🙏🌼🌼

తేది:-15-01-2016.   

శీర్షిక :- దేశ భాష అభ్యసించు.

తే**
ఆంగ్ల మొక్కటె గాదుర అవని  యందు,
భాష లెన్నియొ యున్నవి  బంధు లార
దేశ భాషను అభివృద్ధి దెలియ గనుము
మరువ వలదోయి భానుని మంచి మాట. 

  తే**
అఖిల భాషలు భాషించు భాగ్య మబ్బ
ఆంగ్ల మాదిగ భాషలు యభ్య సించు
దెలుగు భాషను యుంచుము దిరుగు లేక
మరువ వలదోయి భానుని మంచి మాట.

అందరికీ మకర సంక్రాంతి
        
     
21.01.2016.

          శీర్షిక : యెన్నిక

కం** ఎన్నిక గెలిచిన వారలు
మన్నన జేయక తిరిగెరు మనుషుల మధ్యన్ 
కన్నులు మూసుక పోయెన
యెన్నడు గలువరు జనులను యేమని యందున్!!( )

             అంబటిభానుప్రకాశ్.

🙏🙏🌷🙏🌷🙏🙏

శీర్షిక.   : సాయి మహిమ.

శిరిడీ పురాన వెలిసెను
కరుణా మయుడై గురువర కార్యము కొరకై,
సిరులను యిచ్చెను గోరిన
వరదుడు సద్గురు మహిమను వరుసను గనుమా.

  
2 2.01.2016.
శీర్షిక : వేంకట నాధుడు.

సిరి గావలెనను వారలు
తిరుమల వాసుని మనమున దీనత దలువన్
వరదుడు వేంకట నాధుడు
సిరితో గూడియు కదలును సేమము యరయన్.

          
🌷🌷🙏🌷🌷🌺🌷🌷

శీర్షిక :  అప్పులు 

అప్పులు జేయకు నరుడా
తిప్పలు బడుటయు వలదిక ,తేటగ జూడన్
చప్పున మెలకువ గలిగియు              
అప్పులు జేయుట.  మరువుము,యశమే నీకున్!!                       
 (    91  )🌺🌺🌺🙏🌺🌺🌺
🌻🌻🌻🌺🌻🌻🌻

గద్వాల.

శీర్షిక :  హరినిగను.

శ్రీధరు నామము దలచియు
మాధవరూపము సతతము *మదిలో నిలిపీ.
కాదన బోవక నిరతము 
సాధన జేసియు హరిగను *సకలము శౌరీ  !!

🌺🌺🌺🌻🌺🌺🌺
అంబటిభానుప్రకాశ్.
స.క.956..

" అన్నదాత"
ఆ*
నంది నెక్కితిరుగునటరాజు శివుడేను
మంచు కొండ మీద మహిమ
 జూపు
జంట నందులెక్కి తిరిగేటి రైతన్న
పంట పొలము లోన పసిడి జూచు.

ఆ***
సృష్టి కర్తమనలసృజియించు వేళను
నూక బెంచు వాని నూటి కొకని
బువ్వబెట్టిబెంచ భూమిజనుల
యవని యందు వెలిసె యన్నదాత.


......భానుప్రకాశ్ అంబటి.
         స.క౯౫౬.
🌺🌷🌺🌷🌺🌷🌺🌷


గద్వాల.
 తేది:-28-01-2016.

శీర్షిక : కలిసి ఉంటే కలదు సుఖము.

కన్న పిల్లల మీదను కఠిన తనమె
కలుగ లేదని యేడ్తురె  కంట నీరు
కాకి చూపెడి మమతను కనగ లేదె
మరువ వలదోయి భానుని మంచి మాట.
                                       (107)

జన్మ నొసగెరు ప్రేమతొ జనకు లార
పార వేయుట మానుడు పాచి లోన.       ప్రేమ గురిపించి  మీరలు పెంచు మిపుడు
మరువ వలదోయి భానుని మంచి మాట.
                                        (108)

ఆడ పిల్లలు గనుటకు యాస పడుడు
ఆడ పిల్లలు బుట్టట యాది నుండి
లక్ష్మి బుట్టిన దనలేద లక్ష ణముగ
మరువ వలదోయి భానుని మంచి మాట. 
                                       (109)

బీద తనమున గడువక బిడ్డ నమ్మ.,
యమ్ము కొనుటకు గాదిది యాట బొమ్మ,
ప్రేమ మీరనె పెంచుము పిల్ల లెపుడు.
మరువ వలదోయి భానుని మంచి మాట. 
                                       (110)

భార్య భర్తలు విడిపోవ బాగు బాగు
అమ్మ నాన్నలుగవిడుట అంద మౌన
చేయ కండి యనాధగ ,చింత జేయ 
మరువ వలదోయి భానుని మంచి మాట. 
                                        (111)
 విడిచి పోమని జెప్పుట రీతి గాదు
కలసి యుండగ గోరితి కాల మెల్ల
కలసి యుంటెనె సుఖమని కనగ లేద. మరువ వలదోయి భానుని మంచి మాట.                   
                                        (  112)       
🙏🙏🌺🙏🙏🌺🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺
.
09-02-2016.
శీర్షిక :- చేసి చెప్పు.- 

తే* చేయు వానికే యర్హత చెప్ప గాను,
చేత గానియు వాడేర చెత్త గాడు
చేసి చెప్పిన వానినె జేరు మనసు
మరువ వలదోయి భానుని మంచి మాట.

************అంబటి***********
🌷🌷🌷🌸🌸🌷🌷🌷